OTT Movies : ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతికి భారీ చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే రెండు ఫీల్ గుడ్ మూవీస్ కూడా వచ్చాయి. కేవలం ఈ సినిమాలు మెసేజ్ లకే పరిమితం కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకున్నాయి. థియేటర్ రిలీజ్ ని ముగించుకున్న ఆ చిత్రాలు ఈ రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ చిత్రాలు ఏంటంటే.. ఒకటి కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన “సార్” కాగా మరో చిత్రం మన టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సుహాస్ నటించిన “రైటర్ పద్మభూషణ్”. ఈ రెండు చిత్రాలు కూడా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాల ఓటీటీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..
ఈ రోజు ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ధనుష్ సార్ మూవీ నెట్ ఫ్లిక్స్ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండగా సుహాస్ రైటర్ పద్మభూషణ్ చిత్రం జీ 5 చూడవచ్చు. ఈ సందేశాత్మక, ఫీల్ గుడ్ మూవీలను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.