OTT New Movies : ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్ లో రిలీజ్ కోసం వెయిట్ చేసినట్టు ప్రేక్షకులు ఇప్పుడు రిలీజ్ అయిన కొత్త సినిమాలు OTT లోకి ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఈ వారం కూడా పలు సినిమాలు OTT లో సందడి చేయనున్నాయి.
అందులో ముఖ్యంగా రామ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన స్కంద ముందు వరుసలో ఉంది. అయితే థియేటర్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా ఓటిటిలో మాత్రం కచ్చితంగా మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.. అలానే షారుక్ ఖాన్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వచ్చి 1000 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ హిట్ అయినా జవాన్..
దానితోపాటు చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కలర్స్ స్వాతి మంత్ ఆఫ్ మధు సినిమాలు కూడా ఉన్నాయి.. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈమధ్య కాలంలో యూత్ ని ఎక్కువగా ఆకట్టుకున్న మూవీ “MAD” ఈ సినిమా కూడా ఈ వారంలోనే OTT లో విడుదల కానుంది. మొత్తానికి ఈ వారం OTT ప్రేక్షకులకు వినోదాల విందు ఖాయం..