Pathaan OTT Release Date : ఇటీవల బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు బాయ్ కాట్ సెగ. దీంతో బాలీవుడ్ తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయింది. వచ్చిన సినిమా వచ్చినట్లే ఫ్లాపవుతూ వస్తోంది. అయితే అందుకు భిన్నంగా పఠాన్ మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ మూవీ 1,000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, ఇటీవలే బాహుబలి 2 రికార్డులను కూడా తిరగరాసింది. ఇప్పటికీ థియేటర్లలో అదే జోరును కంటిన్యూ చేయడం గమనార్హం. ఇదిలాఉంటే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పఠాన్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.