Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే రాజకీయాల కోసం గ్యాపిచ్చిన పవన్.. సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు.
అప్పటి నుంచి వరుస చిత్రాలతో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో రూపొంది ZEE5లో నేరుగా స్ట్రీమింగ్ అయిన ‘వినోదయ సీతమ్’ సినిమాను ఈ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు.
Also Read: అందుకే బాలీవుడ్‌కి వెళ్లిపోతున్నా : రష్మిక
అలాగే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఫిబ్రవరి 14న ఈ మూవీని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ 18 రోజుల కాల్ షీట్లు ఇవ్వబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.