తన డైరెక్టర్ కు సూపర్ సప్రైజ్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు.
ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాల క్రితం తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం మనకు తెలిసింది. అలా సినిమాలకు కొంత కాలం పాటు గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన అభిమానుల కోరిక మేరకు తిరిగి హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడమే కాకుండా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా వేణు శ్రీరామ్ కు పవన్ కళ్యాణ్ మరియు అన్నా లేజేనోవా దంపతులు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ బహుమతులను పంపించారు. తన ఫేవరెట్ హీరో నుండి వచ్చిన బహుమతుల ఫోటోలను వేణు శ్రీరామ్ సతీమణి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ పవన్ మరియు అన్నా లేజేనోవాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది.