Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్. తమిళ్ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ దిశగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎప్పటికప్పుడు పవన్ మూవీ అప్డేట్ ఇస్తున్నప్పటికీ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఈవెంట్ ను గోదావరి జిల్లాలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. రాజమండ్రి అయితే మరింత రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెసెంట్ పవన్ వారాహి యాత్ర కూడా గోదావరి జిల్లాలోనే సాగుతోంది. అందుకే ఈ మూవీ ఈవెంట్ ను అక్కడే ప్లాన్ చేయనున్నారట. ఇదే నిజమైతే సినిమాపరంగా, రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉంది.