Pawan Kalyan Bro Prerelease Event : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల లేటెస్ట్ మూవీ బ్రో పై మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీలో కేతికా శర్మ, రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, తణికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలు నటించగా.. మరోసారి పవన్ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించిన బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది.
ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ అనేక అంశాలపై మాట్లాడాడు. ఈ మేరకు ఆయన కోలీవుడ్ కు కొన్ని విజ్ఞప్తులు చేశారు. టాలీవుడ్ లో అన్ని భాషల వారు పనిచేస్తారు. తెలుగు పరిశ్రమ అందరికీ ఆహ్వానం పలుకుతుంది. అన్ని భాషల వాళ్లు ఉంటేనే అది సినిమా అవుతుంది. కేవలం ఒక ప్రాంతం వాళ్లు మాత్రమే ఉండాలని అనుకోకూడదు. మరింత విస్తృత పరిధిలో ఆలోచిస్తే కోలీవుడ్ నుంచి కూడా ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు వస్తాయి. మీరూ అలాంటి గొప్ప సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని పవన్ కల్యాణ్ అన్నాడు.
Vaishnavi Chaitanya : బేబి హీరోయిన్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఉస్తాద్..
అలాగే డైరెక్టర్ సముద్రఖని గురించి మాట్లాడుతూ టాలెంటెండ్ వ్యక్తి అని ప్రశంసించారు. సముద్రఖని తమిళ వ్యక్తి అయినా.. కేవలం 6 నెలల్లో తెలుగు మాట్లాడటం నేర్చకున్నాడని.. దీంతో ఆయనకి నేను అభిమాని అయిపోయానని పవన్ అన్నారు. తాను కూడా సముద్ర ఖని కోసం తమిళ్ స్పష్టంగా నేర్చుకొని తమిళ్ స్పీచ్ ఇస్తానని మాటిచ్చారు. తాను జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ గొప్పగా డ్యాన్స్ చేయలేకపోవచ్చు కానీ.. సినిమా అంటే తనకు ప్రాణమన్నారు. నా ఊహాల్లో హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే అని అన్నారు.