Pawan Kalyan : ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇందులో క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్ కి కొంత గ్యాప్ రాగా.. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న బ్రో ది అవతార్ మూవీలో తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు పవన్. ఇవికాగా మిగతా రెండు సినిమాలు యంగ్ డైరెక్టర్స్ అండ్ పవన్ ఫ్యాన్స్ తెరకెక్కిస్తున్నారు. అందులో ఒకటి హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, వీరి కాంబోలో ఇప్పటికే గబ్బర్ సింగ్ రాగా
అది బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. మరో మూవీ యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న మూవీ ఓజీ.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సుజీత్ కూడా పవన్ కు వీరాభిమాని అవడంతో పాటు సాహో వంటి భారీ యాక్షన్ తెరకెక్కించిన అనంతరం చాలాకాలం తర్వాత సుజీత్ పవన్ తో మూవీ చేస్తున్నాడు. దీంతో ఓజీపై నెక్స్ట్ లెవెల్ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించనుండగా
ఈ సినిమాపై ఇప్పుడు మరో క్రేజీ బజ్ బయటికొచ్చింది. ఈ సినిమాలో పవన్ ఇంట్రడక్షన్ సీన్ తన కెరీర్ లో ది బెస్ట్ సీన్ గా ఉండబోతుంది అని టాక్. సుజీత్ మోస్ట్ పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ సీన్ ని పవన్ కి ప్లాన్ చేసాడట. ఇప్పటి వరకు పవన్ మూవీస్ బెస్ట్ ఇంట్రో సీన్స్ పంజా, అజ్ఞాతవాసితో పాటు వకీల్ సాబ్ లో ఉండగా వాటిని బీట్ చేసేలా ఓజీ లో చేశాడట డైరెక్టర్ సుజీత్. ఓజీ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. RRR ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.