Pawan Kalyan Movie Updates : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు షూట్ కి గ్యాప్ రావడంతో సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ రిమేక్ వినోదయ సిత్తమ్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో పవన్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
వీటితో పాటు పవన్ సుజిత్ దర్శకత్వంలో ది ఓజీ, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటించనున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ కి భారీ అంచనాలున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఉస్తాద్ భగత్ మూవీ యొక్క లుక్ టెస్ట్ ఫోటో షూట్ ని నిర్వహించింది చిత్ర యూనిట్.
దర్శకుడు హరీష్ శంకర్ అండ్ టీమ్ పాల్గొన్న ఈ ఫోటోషూట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మూవీ షూట్ ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్, హరీష్, దేవిశ్రీ కలిసి చేస్తుండడంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి.