Pawan Kalyan OG Movie : పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబో తెరకెక్కుతున్న తాజా చిత్రం The OG. సుజీత్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ OG పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో వంటి హై యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సుజీత్ ఈ సినిమాను సిద్ధం చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
RRR ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ చిత్రానికి క్రియేటివ్ ఎడిటర్ కావాలంటూ తాజాగా చిత్ర యూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఆసక్తి కలవారు team@theycallhimog.comకి తమ సీవీలను మెయిల్ చేయవచ్చని తెలిపింది.
ఏప్రిల్ 14, 2023 లోగా తమకు డీటైల్స్ మెయిల్ చేయమంటూ చిత్ర యూనిట్ తెలిపింది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తూనే.. సాయి ధరమ్ తేజ్ తో కలిసి వినోదయ సీతం తెలుగు రీమేక్ కంప్లీట్ చేస్తున్నారు.
https://twitter.com/DVVMovies/status/1645652428434579457?s=19
Discussion about this post