Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ సెట్స్ పైకి తీసుకెళ్లి పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ మూవీ షూటింగ్ లో బిజీ అయ్యాడు పవన్. ఈ మూవీ షూటింగ్ ప్రెసెంట్ మహాభళేశ్వరంలో జరుగుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనుండగా పవన్ సరసన ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తుంది. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలావుండగా నెట్టింట ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే.. పవన్ తనయుడు అకీరా నందన్ కూడా ఈ సినిమాలో నటించనున్నడట. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ కి మాస్ జాతరే. పవర్ స్టార్ ఒక్కడు స్ర్కీన్‌పై కనిపిస్తేనే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది పవన్‌తో పాటు అకీరానందన్ కూడా ఒకేసారి స్ర్కీన్‌పై కనిపిస్తే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో పవన్ కనిపించనున్నాడని టాక్.
ఇందులో ఒకటి మాఫియా డాన్ పాత్ర కాగా, మరొకటి కాలేజ్ లెక్చరర్ రోల్ అట. అలాగే టీనేజ్ కుర్రాడిగా కూడా పవన్ కనిపించనున్నారట. అయితే ఈ రోల్ కోసం డైరెక్టర్ సుజీత్.. అకీరా నందన్‌ని తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై సుజీత్ పవన్ తో చర్చిస్తున్నారట. అకిరా నందన్ నటుడిగా, అందులోనూ పవన్ మూవీతో పరిచయం అయితే పవర్ స్టార్ అభిమానుల కోలాహలం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.