Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఓజీ. They Call Him OG.. అనేది ఉపశీర్షిక. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా యువ కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… ఈ సినిమాలో మరో అమ్మాయి కూడా ఉన్నట్టు ప్రకటించారు మేకర్స్. ఓజీలో వెర్సటైల్ నటి శ్రియా రెడ్డి కూడా నటిస్తున్నట్టుగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వగా ఈ వెల్కమ్ తో
ఆమె చిత్ర యూనిట్ అందరికీ థాంక్స్ చెప్పింది. ఇక శ్రియా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పందెంకోడి చిత్రంలోని ఈమె నటనకు మంచి పేరు వచ్చింది. పొగరు, అమ్మ చెప్పింది వంటి చిత్రాలలో శ్రియా రెడ్డి నటించింది. ఇక ఈమె హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. సలార్’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న శ్రియా రెడ్డి, ‘OG’లోను ఛాన్స్ కొట్టేసిందన్న మాట.
ఓజీ కథ 1950 కాలంలో.. ముంబై నేపథ్యంలో కొనసాగుతుందని సమాచారం. ఆ కాలానికి చెందిన గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపిస్తారని అంటున్నారు. ఓజీలో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల ప్రటించిన విషయం తెలిసిందే. ఈ డిసెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశం. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. RRR ఫేమ్ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
#OG #FireStormIsComing #TheyCallHimOG @DVVMovies @dop007 @prakashraaj @PawanKalyan @sujeethsign pic.twitter.com/RfbKwkZ3VB
— Sriya Reddy (@sriyareddy) June 13, 2023