Pawan Kalyan : ఇటీవల భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి సంవత్సరం అవుతున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ అప్డేట్స్ తప్పా సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొంత నిరుత్సాహంగా ఉన్నారంటే చెప్పాలి. రాజకీయాల కోసం గ్యాపిచ్చిన పవన్.. వరుస సినిమాలతో దూసుకుపోతూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఒకేసారి నాలుగు సినిమాలు ఒకే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు పవర్ స్టార్.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే సుజీత్ తో ఓజి మూవీస్ చేయనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తమిళ్ మూవీ ‘వినోదయ సీతమ్’ సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నాడు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు. అలాగే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు.
ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలావుండగా తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాత పవన్ మూవీ థియేటర్స్ కి వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
#PKSDT storming in theatres from 2️⃣8️⃣th July 2023🌀
Bombarding updates on the way💥@PawanKalyan @IamSaiDharamTej@vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ @zeestudiossouth pic.twitter.com/HpuF8i34xf
— People Media Factory (@peoplemediafcy) March 24, 2023