Pawan Kalyan : ఓ వైపు వరుస సినిమాలు చేస్తూ రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకేసారి నాలుగు సినిమాలు ఓకే చేసి అందరికీ షాక్ ఇచ్చాడు పవర్ స్టార్. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే సుజీత్ తో ఓజీ మూవీస్ చేయనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తమిళ్ మూవీ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో
పాటు కీలక పాత్రలో నటించనున్నారు. అలాగే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నాడు. ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.
ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ను తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ఈ పాటకి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుతో ఈ మూవీలో పవన్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కానుంది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత పవన్ మూవీ థియేటర్ లోకి రానుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
