Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. కానీ, ఇప్పుడు? ఆయనొక అగ్ర కథానాయకుడు, అభిమానులకు పవర్ స్టార్. చిరంజీవి తమ్ముడు నుంచి పవర్ స్టార్‌గా ఎదగడం వెనుక మెగా వారసత్వం ఒక్కటే లేదు. హీరోగా పవన్ కళ్యాణ్ పడిన కష్టం ఉంది. కథల ఎంపికలో చూపించిన వైవిధ్యం ఉంది.
ఇటు రాజకీయంగా ప్రస్తుతం పవన్ దూసుకు పోతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే.. అధికార పక్షానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సినిమా, రాజకీయాలను బాలన్స్ చేస్తూ పవన్ తన అభిమానులకు మరింత చేరువయ్యాడు. పవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది.
ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో పవన్ మార్షల్ ఆర్ట్స్ మెలకువలు చూసి ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ తమ్ముడు, జానీ మూవీల్లోనూ బాక్సింగ్‌తో ఆకట్టుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ మీద తనకున్న అభిమానాన్ని అలా చాటుకున్నాడు పవర్ స్టార్.. అయితే సినిమాల్లోకి రాకముందు మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన ఇచ్చినప్పటి రేర్ పిక్ ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ ఫోటోలో పవన్ చేతికి రక్తం కారుతూ ఉంది. ఈ కళ్యాణ్ అనే పేరు పవన్ కళ్యాణ్‌గా మారింది ఈ మార్షల్ ఆర్ట్స్ స్టేజ్ మీదనే.. ఇండియన్ కరాటే అసోసియేషన్ వారు ‘పవన్’ అనే బిరుదునివ్వడంతో పవన్ కళ్యాణ్ అయ్యారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పవన్ ఫ్యాన్స్ ఈ పిక్ ని తెగ షేర్ చేస్తున్నారు.
https://twitter.com/BongChh/status/1431245837615525895?t=fz40guY3aQYpr_ZN1mP_kw&s=19