Pawan Kalyan – Ravi Teja : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,మాస్ మహారాజా రవితేజ ఇద్దరు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు డాలి దర్శకత్వం వహించబోతున్నారని అప్పట్లో ఒక వార్త తెగ హాల్ చల్ చేసింది. కానీ ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలియలేదు. కానీ మళ్ళీ అదే న్యూస్ తో ఇప్పుడు నెట్ ఇంట్లో చెక్కర్లు కొడుతుంది మరో వార్త.
పవన్ కళ్యాణ్ అంటేనే ఫ్యాన్స్ లో ఒకలాంటి ఉత్సాహం ఉంటాయి. ఇంకా అతనితో కలిసి మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రవితేజ చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా లో రవితేజ నటన హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు రవితేజ మళ్లీ పవన్ తో కలిసి వెండితెరను పంచుకోనున్నారు.
ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో అదిరిపోయే కాంబో రెడీగా ఉందంటూ ఇద్దరు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి డాలి దర్శకత్వం వహిస్తున్నారు. అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, రవితేజ ఇద్దరూ ఆవేశంతో నడిచి వస్తున్న ఫోటో ఒకటి ఫాన్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అయిపోయింది. డాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి “మాస్ పవర్” అని టైటిల్ ని పెట్టినట్టు ఫ్యాన్స్ ఇన్స్టాల్ షేర్ చేశారు.
డాలి ఇప్పటికే పవన్ తో రెండు సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో రీమేక్ సబ్జెక్టును పవన్ కోసం సిద్ధం చేశారు. దీంట్లోనే మరో హీరోగా రవితేజను ఎంచుకున్నట్టు టాక్. ఈ విషయంపై పవన్ ,రవితేజలను డాలి కలిసినప్పుడు వెంటనే వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.