Pawan Kalyan Remuneration: హరిహర వీరమల్లు రిలీజ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర సందడి బుధవారం రోజు నుంచే థియేటర్స్ లో ప్రారంభం కాబోతోంది. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. హరిహర వీరమల్లు టికెట్ లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పవన్ కి నో రెమ్యునరేషన్
మరోవైపు ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పవన్ మీడియాతో ముచ్చటిస్తూ హరిహర వీరమల్లు చిత్రానికి తాను రెమ్యునరేషన్ తీసుకోలేదని ఊహించని వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ లో ఎక్కువగా కష్టపడిన చిత్రం హరిహర వీరమల్లే అని పవన్ అన్నారు.

ఎమ్మెల్యేలకు ప్రత్యేక షో ?
హరిహర వీరమల్లు చిత్రం హిట్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంటానేమో అని పవన్ అన్నారు. తన సహచర ఎమ్మెల్యేలు, మంత్రులకు హరిహర వీరమల్లు చిత్రాన్ని స్పెషల్ షో వేసే ఆలోచన పెట్టారు. వారు కోరుకుంటే తప్పకుండా స్పెషల్ షో అరేంజ్ చేస్తానని అన్నారు.
Pawan Kalyan Speech: మొఘల్ అరాచకాలు బయటపెట్టే చిత్రం వీరమల్లు, క్లైమాక్స్ నేనే డిజైన్ చేశా.. మీకు నచ్చితే బద్దలు కొట్టేయండి
సినిమాలు చేస్తున్నప్పటికీ రాజకీయాలే తన మొదటి ప్రాధాన్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉండడం వల్ల తాను సినిమాలని సరిగ్గా పట్టించుకోవడం లేదని అభిమానులు తిడుతున్నారు.అందుకే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలని ఎంతో జాగ్రత్తగా చేశానని పవన్ తెలిపారు.