Pawan Kalyan: ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ షోకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆహా తాజాగా ప్రోమో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ ప్రోమో రిలీజ్ అయిన నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో కూడా ఉంది.
అయితే పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోనే కాకుండా మరో ఒక ఫోటో మరియు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ బాలకృష్ణ షోలో దాదాపుగా ఒకరిగా కాకుండా ఇద్దరు గా వస్తూ ఉంటారు సెలబ్రెటీస్. అయితే ఇప్పుడు పవర్ స్టార్ ఎపిసోడ్ లో కూడా అదే జరగబోతోందట. మొన్నటి వరకు దర్శకుడు త్రివిక్రమ్ లేదా కృష్ వస్తారు అనుకున్నారు అందరూ.
అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ మరియు బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బీఈ ఫోటోలో సాయిధరమ్ తేజ్ మాత్రం సింపుల్ గా పంచె కట్టుతో కనిపించడం విశేషం. ఇప్పుడు ఈ షోలో సాయి ధరమ్ తేజ్ ఏం చెప్పబోతున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.
మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, బాలయ్య మరొకవైపు ఇలా ప్రేక్షకులను వినోదాన్ని పంచడంతో అభిమానులు సైతం మాకు ఇంకేం కావాలి అంటూ తెలియజేస్తున్నారు. ఇలా టీజర్ తో ఫోటోలతో భారీ అంచనాలను పెంచేస్తున్న ఈ ఎపిసోడ్ జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.