Pawan Kalyan – Sai Dharam Tej Movie Launched:అద్దిరిపోయే లుక్ లో పవర్ స్టార్ పవన్కళ్యాణ్ …ఇక ఆపేది ఎవడ్రా అంటూ అభిమానుల సంబరాలు
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు వరుస సినిమాలతో కూడా బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే.ఇక పవన్కళ్యాణ్ సినిమా అంటే చాలు.. క్రేజ్ మాములుగా ఉండదు. ఆయన మూడు గంటలు తెరపై కనిపిస్తే చాలు.. కథ లేకున్నా ఇండస్ట్రీ హిట్ కొట్టేంత ఫాలోయింగ్, బ్రాండ్ ఆయన సొంతం.
తాజాగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న సినిమా ఒకటి ప్రారంభం అయింది.అయితే ఈ సినిమా ప్రారంభ వేడుకల్లో పవన్కళ్యాణ్ గారు పాల్గొన్న లేటెస్ట్ ఫోటో ఒకటి భయటికి వచ్చింది. దింట్లో పవన్కళ్యాణ్ గారి లుక్ చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
బ్లాక్ టీ షర్ట్, ఖాకీ రంగు ప్యాంట్ తో ఉన్న పవన్కళ్యాణ్ అద్దిరిపోయారు.ఇదే లుక్ తో గనుక సినిమాలో పవన్కళ్యాణ్ కనిపిస్తే ఇక అభిమానులని “ఆపేది ఎవడ్రా” అంటూ అభిమానులు తెగ హల్ చల్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళ్ లో హిట్ అయిన “వినోదయ సిత్తం” సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా సముద్రఖని నే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒరిజినల్ కథకి మార్పులు చేసి మాటలు అందిస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా లో సాయిధరమ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటిస్తోంది.