Pawan Kalyan – Sai Dharam Tej: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్యూటీఫుల్ అండ్ సెన్సేషనల్ కాంబో ఎట్టకేలకు ఈ రోజు ప్రారంభమైంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదాయ సీతంను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా తమన్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఎట్టకేలకు మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు ప్రారంభించగా సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్.. పవన్ తో కలిసి వర్క్ చేయడంపై ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసాడు.
తన గురూ తన మామ అయినటువంటి పవన్ కళ్యాణ్ తో సినిమాలో కలిసి వర్క్ చేయడం తన జీవితంలో బెస్ట్ డే అని, దీనిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని, ఈ అద్భుతమైన అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందపడుతున్నానని అలాగే మీతో కలిసి వర్క్ చేయడంతో మరింత నేర్చుకుంటానని ఓ ఎమోషనల్ పోస్ట్ తో బ్యూటీఫుల్ ఫోటో షేర్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
'THE BEST DAY' I would cherish forever.
It's a dream come true to work with my Guru for life @PawanKalyan ❤️
Grateful at this amazing opportunity & Can't wait for a big chunk of learning and memories.@thondankani @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy @ZeeStudios_ pic.twitter.com/q52FFy2kbk— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 22, 2023
Discussion about this post