Pawan Kalyan Struggles in movies: రాజకీయాల్లోకి వచ్చాక పవన్ సినిమాలకు ఇబ్బందులు
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర సందడి బుధవారం ప్రీమియర్ షోలతో ప్రారంభం కానుంది. తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల అవుతోంది.
ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వచ్చాక తనకి సినిమా రంగంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని పవన్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది దర్శకులు, రచయితలు తనకి కథలు చెప్పడమే మానేశారు అని పవన్ అన్నారు. ఈ టైంలో ఇతడితో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ? సరిగ్గా చేస్తాడో లేదో అనే అనుమానం కలిగి ఉండొచ్చు.

నా దగ్గర సాయం పొందిన వాళ్ళు కూడా..
నా దగ్గర సాయం పొందిన కొందరు ఫైనాన్షియర్స్ నా సినిమాలకు ఫైనాన్స్ కూడా ఆపేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రజా సేవ, రాజకీయాలు, సనాతనం ధర్మంపై బాధ్యత వల్ల తన వృత్తిని పణంగా పెట్టాల్సి వచ్చింది అని .. ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా కోల్పోయాను అని పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు చిత్రానికి తాను ఇంకా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపారు.
చిత్ర పరిశ్రమ ఏపీకి రావాలి అనే వాదనపై కూడా పవన్ స్పందించారు. చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా పర్వాలేదు. కానీ ఏపిలో ముందుగా ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని పవన్ అన్నారు.