ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ.. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందులో క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు ఒకటి కాగా మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్.
అయితే ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కాకముందే పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ తో మరో సినిమాని అనౌన్స్ చేశాడు. సుజీత్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ OG పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయింది. సాహో వంటి హై యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని సుజీత్ ఈ సినిమాను సిద్ధం చేశాడు.
Also Read: Crying Benefits: వార్నీ.. ఏడవడం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..!?
పైగా పవన్‌కు సుజీత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ ఇప్పటి నుండి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. కాగా తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా ప్రారంభమైయ్యాయి(Pawan Kalyan and Sujeeth’s Film Launch Ceremony). అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్ ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది.
తాజాగా ఈ ఈవెంట్‌కు పవన్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు(Pawan Kalyan Sujeeth OG Movie Opening Ceremony). పవన్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇక ఈ కార్యక్రమానికి థమన్ కూడా హాజరయ్యాడు. RRR ఫేమ్ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
THE OG HAS ARRIVED!!! #TheyCallHimOG #FireStormIsComing pic.twitter.com/Zwxutwps9f
— DVV Entertainment (@DVVMovies) January 30, 2023