Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎపిసోడ్ ప్లాన్ చేసి జనాల్లో క్యూరియాసిటీ పెంచేసింది ఆహా టీమ్. ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్, టీజర్ ద్వారా ఈ ఎపిసోడ్ లో మంచి ఫన్ ఉండబోతుందని అందరికీ అర్థమైంది.
పవన్ కళ్యాణ్ సినిమా, పాలిటిక్స్ విషయమై ఎన్నో టాపిక్స్ బయటకొస్తాయని తెలిసింది. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు కొద్దిసేపు డైరెక్టర్ త్రివిక్రమ్, డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారు.
Also Read: రామ్ చరణ్ కు సెట్ కానీ పాత్ర విజయ్ కి ఎలా సెట్ అవుతుంది..!?
తాజాగా విడుదలైన ప్రోమో అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఆరా తీశారు బాలయ్య. ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ ఎలా అయ్యారు అంటూ ప్రశ్నించారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో పవన్, బాలయ్య మధ్య ఆసక్తికర ప్రశ్నలు.. సమాధానాలు కూడా నడిచినట్లుగా తెలుస్తోంది.
దీంతో దీన్ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయాలని ఆహా యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. రెండు ఎపిసోడ్స్ కూడా ఒకదాన్ని మించి మరొకరి ఉండేలా ప్లాన్ చేశారట. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్.. మొదటిసారి బాలయ్యతో కలిసి టాక్ షోలో పాల్గొనడం విశేషం. మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తోందో చూడాలి.