వకీల్ సాబ్ తర్వాత పవన్ నటించబోయే చిత్రం పోస్టర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అభిమానులకు అందించారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా.. గతంలో పవన్ తో ఖుషి వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించిన ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం, సాయిమాధవ్ బుర్రా మాటలు అందించబోతున్న ఈ చిత్రం పోస్టర్ చూస్తుంటే చారిత్రక నేపథ్యం లో తెరకెక్కుతున్నట్లు అనిపిస్తుంది.
కాగా గతరాత్రి చిత్తూరులో ముగ్గురు పవన్ అభిమానులు విద్యుదాఘాతానికి గురై మరణించిన విషయం తెలిసిందే, వారి కుటుంబాలకు పవన్ నిర్మాతలు అండగా నిలిచారు. వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు ఒకోక్కరికి రెండు లక్షలు సహాయం ప్రకటించగా, PSPK 27 చిత్ర బృందం ఒక్కొక్కరికి రెండు లక్షలు సహయం ప్రకటించింది. అదేవిధంగా జనసేన పార్టీ 2లక్షలు, అల్లు అర్జున్ తరపున 2 లక్షలు చొప్పున వారి కుటుంబాలకు అందించనున్నట్లు ప్రకటించారు.
