Pawan – Sreeleela : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ బ్యూటీ పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో శ్రీలీలా అంటే యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ధమాకా సినిమాలో నటన, డాన్స్ శ్రీలీలను ఓ రేంజ్ కి తీసుకెళ్ళాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. SSMB 28 లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం మార్చి చివరి నుంచి సెట్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీలను తీసుకోవాలని ఆలోచిస్తున్నారంట. ఇదే కనుక ఫైనల్ అయితే శ్రీలీల క్రేజ్ మామూలుగా వుండదు.