అటు ఇండస్ట్రీ, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ వచ్చేసాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురు చూపులకు ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు తెరపడింది. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రం మోషన్ పోస్టర్ ఈరోజు పవన్ జన్మదిన సందర్భంగా విడుదల చేశారు.
చాలా రోజుల తర్వాత పవన్ తెరపై కనిపించే ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో చేతిలో దండెంతో , మరో చేతిలో న్యాయశాస్త్ర పుస్తకం తో లాయర్ గెటప్ లో ఉన్న పవన్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుంది
సత్యమేవ జయతే అంటూ అదిరిపోయే విధంగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బాక్ గ్రౌండ్ స్కోర్ ని బట్టే వకీల్ సాబ్ సినిమా థీమ్ ఎంటి అనేది దర్శకుడు చెప్పకనే చెప్పాడు. ఫ్యాన్స్ వకీల్ సాబ్ తెరపైకి వచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క చాలా కాలం తరువాత విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ ముందు ఎటువంటి సంచనలను నమోదు చేస్తుందా అని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంచనాలు వేయడం మొదలు పెట్టారు. మరి వారి అంచనాలకు,అభిమానుల ఎదురు చూపులకు ఎప్పుడు తెర పడుతుందో చూద్దాం.