Pooja Hegde Monica Song: మోనికా సాంగ్ లో పూజా హెగ్డే కష్టాలు
డస్కీ బ్యూటీ పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూజా హెగ్డే తెలుగులో దువ్వాడ జగన్నాధమ్, మహర్షి, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత, రాదే శ్యామ్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. అయితే ఇటీవల పూజ హెగ్డే కి వరుసగా ఫ్లాపులు ఎదురుకావడం తో తెలుగులో ఆమె హవా తగ్గింది.
పూజా హెగ్డే ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. మోనిక అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. ఈ సాంగ్ లో హుషారెత్తించే బీట్, పూజ హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ , ఆమె గ్లామరస్ లుక్ యువతని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ సాంగ్ వైల్డ్ ఫైర్ లాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తుంది.
ఉపవాసం ఉంటూ డ్యాన్స్
ఈ ఒక్క సాంగ్ తో కూలీ చిత్రానికి కావలసిన హైప్ వచ్చేసిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సాంగ్ లో డాన్స్ చేసినట్లు పూజా హెగ్డే గతంలో ఎప్పుడు చేయలేదని చెప్పాలి. అంత ఎనర్జిటిక్ గా, హాట్ గా డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ సాంగ్ షూటింగ్లో పూజ హెగ్డే పడ్డ కష్టం అంతా ఇంతా కాదట. ఆ విషయాన్ని తెలియజేస్తూ పూజా హెగ్డే తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
మహాశివరాత్రి రోజున ఈ సాంగ్ ని షూట్ చేశారట. వేసవి కావడంతో విపరీతమైన వేడికి ఇబ్బంది పడ్డట్లు పూజా హెగ్డే తెలిపింది. మహాశివరాత్రి కావడంతో ఆ రోజంతా నేను ఉపవాసంతో ఉన్నాను. ఉపవాసంతో ఉన్నప్పటికీ ప్రేక్షకులని అలరించేందుకు కష్టపడ్డాను. డ్యాన్స్ చేస్తుండగా కాలు బెణికింది. ఆమె అసిస్టెంట్ ఒకరు కాలు పడుతున్న దృశ్యాలు కూడా ఈ పోస్ట్ లో ఉన్నాయి. ఇంత కష్టంలో కూడా తనకు సహకరించిన కో డాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలు అని పూజా హెగ్డే పోస్ట్ చేసింది. మోనిక సాంగ్ తో థియేటర్ లో మీరంతా డ్యాన్స్ చేయడం గ్యారెంటీ అని పూజా హెగ్డే హామీ ఇచ్చింది.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.