బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాథేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు, ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో ‘ఆది పురుష్’ చిత్రంలో నటించబోతున్నట్లు ప్రభాస్ గతంలోనే ప్రకటించారు. ఈ చిత్రంలో ఆయన రాముడిగా తెరపై కనిపించబోతున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు ప్రకటించారు.
ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ మీతో కలిసి నటించడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, మీలాంటి గొప్ప నటుడితో కలిసి నటించడం ఉత్సాహం కలిగించే విషయమని ప్రభాస్ తెలిపారు. టీ సిరీస్ సంస్థ సమర్పిస్తూ.. భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న
ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించి తమిళ్, మలయాళం, కన్నడ, ఇతర భారతీయ, విదేశీ భాషల్లోకి అనువదించబోతున్నారు.
త్రీడీలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం 2021లో షూటింగ్ ప్రారంభించి 2022లో విడుదల చేయబోతున్నట్లు మరియు ఈ చిత్రానికి సంబంధించిన ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.