Prabhas Adipurush Release Date : ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం గ్రాఫిక్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఇది అలా ఉంటే ఈ సినిమా విడుదల విషయంలో టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా టీజర్ విడుదలై అభిమానులు నుండి తీవ్రమైన విమర్శలను అందుకుంది ఆదిపురుష్ టీమ్. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్‌ను మార్చేయనున్నారట. ఈ నేపథ్యంలో ఈ సినిమా జూన్ 16, 2023కి వాయిదా వేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మరోసారి తాజాగా ఈ సినిమా విడుదల తేది విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది టీమ్.
ఈ సినిమా జూన్ 16న విడుదలకానుందని ప్రకటించింది. ఇక మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది. దీని కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు. అబ్బా.. సాయిరామ్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
ll रामकार्य करने के लिए हम सदैव तत्पर हैं ll
|| We are always delighted to impart the virtue of Lord Ram ||The world will witness India's timeless epic in 150 days! 🏹 #150DaysToAdipurush#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Prabhas @omraut #SaifAliKhan pic.twitter.com/i5RiJHHeFR
— UV Creations (@UV_Creations) January 17, 2023