Salaar Movie Update : రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవల వరుస ఫ్లాప్ లు వచ్చినప్పటికీ డార్లింగ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఆయా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా సలార్.
పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలాకాలం అయ్యింది. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశగా ఉన్నారు. త్వరలోనే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ లేదా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దరిద్రం నెత్తిమీద ఉన్నట్టే
ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో చేయనున్నారట. విశాఖ పోర్టులో పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. త్వరలోనే టీమ్ మొత్తం వైజాగ్ కు వెళ్లనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు ప్రభాస్. ఫిబ్రవరి నెల మొత్తం ‘ప్రాజెక్ట్ K’, ‘సలార్’ సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండనున్నారు ప్రభాస్.