Prabhas Salaar : బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత డార్లింగ్ కి వరుస పరాజయాలు పలకరించినా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ చిత్రాల సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “సలార్” లో నటిస్తున్నాడు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన కూడా సెన్సేషన్ గా మారుతుంది. ఇదిలా ఉండగా ఇంకా రిలీజ్ కాకముందే ఈ సినిమా మూవీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతంలో మూవీ రిలీజ్ కి ముందుగానే కేజీఎఫ్ 2 బుక్ మై షోలో లక్షకి పైగా ఇంట్రెస్ట్స్ ని సంపాదించుకుంది.
అదేవిధంగా ఇప్పుడు సలార్ పై కూడా లక్షకి పైగా ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీన్నిబట్టి సలార్ మూవీ కోసం మూవీ లవర్స్ ఏ రేంజ్ వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తుండగా ఇటీవలే తన షూటింగ్ ముగించుకున్న విషయం తెలిసిందే. వరల్డ్ వైడ్ ఈ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కి కానుంది, చూడాలి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో..