Prabhas Health Issues : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్న ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సెట్స్‌పై ఆయనవి భారీ చిత్రాలున్నాయంటే ఆయన ఏ రేంజ్‌లో జోరు చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తియనట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు.

ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో పాటు మారుతి డైరెక్షన్‌లోనూ ఓ సినిమా చేయనున్నాడు. అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్‌లోనూ నటించనున్నాడీ యంగ్ రెబల్ స్టార్. ఇలా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్.. అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: వైసీపీ @ 24.. జనంలో అంత వ్యతిరేకతా..?
అందుకే అన్ని షూటింగులకు ప్యాకప్ చెప్పి ఇంటికి వెళ్లినట్లు సినిమా వర్గాల సమాచారం. అయితే ప్రభాస్ జ్వరం బారిన పడడంతో షెడ్యూల్ మొత్తాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది(Prabhas Suffering from fever and he cancelled movie shootings). కాగా ప్రభాస్ అనారోగ్యం బారిన పడ్డారని తెలియగానే ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ఆరోగ్యం బాగానే ఉందని, ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ సన్నిహితులు చెబుతున్నారు.
