Prabhas Trivikram : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రాజెక్ట్ K, సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. అలాగే డైరెక్టర్ మారుతీతో రాజా డీలాక్స్ లోనూ ప్రభాస్ నటిస్తుండగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగతో స్పిరిట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ప్రభాస్ క్రేజీ లైనప్ లో మరో మూవీ చేరనున్నట్టు సమాచారం.
ప్రభాస్ తో మాటల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇప్పటి వరకు ప్రభాస్, త్రివిక్రమ్ టచ్ చేయని ఓ కొత్త స్టోరీ ప్రభాస్ కి నరేట్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ క్రేజీ కాంబో ఎంత వరకు సెట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB28 మూవీతో బిజీగా ఉన్నాడు.