Priya Prakash Warrior : ప్రియా ప్రకాష్ వారియర్.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ భామ. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. టాలీవుడ్ లో ప్రియా, నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.

చాలాకాలం తర్వాత మళ్ళీ తెలుగు నటించింది ప్రియా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లు గా నటించారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించారు. ఇక మాటల మాంత్రికుడు ఈ మూవీకి డైలాగ్స్ తో పాటు స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. అయితే మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మాత్రం డల్ గానే ఉన్నాయి.
Pooja Hegde : సూసైడ్ అటెంప్ట్ చేసిన పూజ హెగ్డే..!
అయితే ఈ మూవీ హీరోయిన్ ప్రియా మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో హాట్ టాపిక్ గా మారింది. తను కన్నుకొట్టే వీడియో పాకిస్తాన్ ప్రేక్షకులకు కూడా తెగ నచ్చేసిందంటూ చెప్పుకొచ్చింది. తనకు పాకిస్థాన్ నుంచి రోజూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టేవారని ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పింది. పైగా తన కోసం పాక్ లోనూ అభిమాన సంఘాలు ఉన్నాయని, వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయానని ప్రియా ప్రకాష్ వారియర్ చెబుతుంది. కాగా బ్రో చిత్రంపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది.
Varahi VijayaYathra : వైసీపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం..
