Dil Raju Love Story : దిల్ రాజు అంటే సక్సెస్.. సక్సెస్ అంటే దిల్ రాజు అన్నంతలా ఉంటుంది. దిల్ రాజు ఓ సినిమా కథను ఓకే చేశాడంటే కచ్చితంగా దాంట్లో విషయం ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. దిల్‌రాజు పేరు చూసి సినిమాకు వెళ్లే వారు ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు తెలుగు పరిశ్రమలో ఎదురు లేదనే విషయం తెలిసిందే. ఆయన ఓ సినిమా తీసున్నారంటే మిగతా ఏరియాలు పోటీపడి కొనుక్కుంటారు.
ఇటీవలే ఆయన నిర్మించిన వారసుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ దూసుకుపోతోంది. ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు మొదటి భార్య మరణించడంతో చాలాకాలం ఒంటరిగానే ఉన్నాడు. దాదాపు మూడేళ్లు ఒంటరిగా ఉన్న తర్వాత 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడే దిల్ రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.
Also Read : 18 పేజెస్ OTT డీటెయిల్స్..
నన్ను చూసి వివి వినాయక్, ప్రభాస్.. అందరూ యాటిట్యూడ్ అనుకున్నారు. నాతో కలిసి పని చేశాక అలాంటిదేం లేదని వారికే అర్థమైంది. నా భార్య వైఘారెడ్డి కూడా అలాగే అనుకుంది, కానీ తర్వాత కూల్ అని తెలుసుకుంది. నా మొదటి భార్య చనిపోయాక రెండేళ్లపాటు చాలా స్ట్రగులయ్యా. అప్పటికి నా వయసు 47 ఏళ్లు. జీవితంలో ముందుకు వెళ్లాలనుకున్నప్పుడు రెండు, మూడు ఆప్షన్లు కనిపించాయి.
కానీ నేనొక సెలబ్రిటీని.. నన్ను అర్థం చేసుకునేవాళ్లు జీవితంలో ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంకా ఇబ్బందిపడాల్సి వస్తుందనుకున్నా. ఆ సమయంలో తేజస్విని కలిసింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నా. సంవత్సరంపాటు ఆమెను అబ్జర్వ్ చేశా. ఆ తర్వాత ఆమెకు ప్రపోజ్ చేశా.. ఇంట్లో వాళ్ళను ఒప్పించా. మాకు ఓ బాబు కూడా పుట్టాడు’ అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు.