Project K : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్న ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సెట్స్‌పై ఆయనవి భారీ చిత్రాలున్నాయంటే ఆయన ఏ రేంజ్‌లో జోరు చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో
‘ప్రాజెక్ట్ K’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనేల నటిస్తుండగా అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అమితాబ్ ఈ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్‌లో అమితాబ్ గాయాపడినట్లు వార్తలు వస్తున్నాయి.
అమితాబ్ హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని.. ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ K సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.