Protest in Front of Ramgopal Verma’s Office : హైదరాబాదులోని రాంగోపాల్ వర్మ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నేలకొంది. అయితే వ్యూహం సినిమా పోస్టర్లను ఆందోళనకారులు తగలబెట్టారు. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని వాళ్ళు నినాదాలు చేస్తూ, ఆర్జీవి ఆఫీస్ ని చుట్టుముట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆర్జీవి ఆఫీస్ దగ్గరికి చేరుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
వ్యూహం సినిమా ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితానికి సంబంధించినది కావడం గమనార్హం. ఈ సినిమా పూర్తిగా వైయస్ జగన్ కి అనుకూలంగా ఉంటుంది అని రాంగోపాల్ వర్మ ముందుగానే తెలియజేయడం కూడా జరిగింది. రెండు రోజుల క్రితం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వ్యూహం సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.
డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు ముందుగానే రాంగోపాల్ వర్మ ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ పై ఆర్జీవి చాలా వ్యంగంగా విమర్శలు చేశాడు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని హైకోర్టులో నారా లోకేష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. డిసెంబర్ 26న ఈ పిటిషన్ విచారణకు రానుందని తెలుస్తుంది.
ఈ విషయానికి సంబంధించి న్యాయస్థానం ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ సినిమా మొత్తం వైయస్ జగన్ లబ్ధి చేకూర్చే విధంగా ఉందని అలాగే చంద్రబాబుకు సంబంధించి చాలా తప్పుగా చూపించారని నారా లోకేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవి ఆఫీస్ ముందు తీవ్ర ఆందోళనలు నెలకొనడం చాలా చర్చినీయాంశంగా మారింది.