Pushpa 2 : మూవీ లవర్స్ గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2. గతంలో వచ్చిన ఈ సినిమా పార్ట్ 1 బాక్సాఫీస్ కనక వర్షం కురిపించడంతో పాటు బన్నీని పాన్ ఇండియా హీరోని చేసింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా..
తాజాగా ఫుల్ వీడియో వదిలి బన్నీ ఫ్యాన్స్ కు సూపర్బ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ వీడియోలో పుష్ప ను చంపేసినట్లు, చనిపోయినట్లు ముందుగా చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బును దేని కోసం ఉపయోగించాడు అనేది కొందరు చెప్పడం జరిగింది. పోలీసులు చంపారా లేదా చనిపోయాడు అనుకుంటున్న టైమ్ లో పులులు జాడ కోసం అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో అల్లు అర్జున్ స్టైలిష్ రాక కనిపించింది.
అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వెళ్లాయంటే.. పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వెళ్లిందంటే.. పుష్ప వచ్చాడని అర్థమంటూ చెప్పించిన డైలాగ్ అదిరిపోయింది. ఇది పుష్ప గాడి రూలు అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. శెకావత్, శ్రీవల్లి, కేశవ ఇలా ఏ కారెక్టర్‌ను కూడా చూపించకుండా బన్నీ బర్త్ డేకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చేశాడు సుకుమార్.