Pushpa 2 Item Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పలో సాంగ్స్ ఎంత హిట్టయ్యాయో అందరి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే చాలు.. కచ్చితంగా ఆ మూవీలో ఐటం సాంగ్ ఉంటుంది. మొదటి సినిమా ఆర్య నుంచి సుక్కు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక లేటెస్ట్ మూవీ పుష్పలో.. ‘ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా మావ అంటూ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది.
స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా ఓ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. అయితే ఇప్పుడు పుష్ప 2లో దాన్ని మించేలా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్లో ఎప్పటిలాగానే ఐటమ్ సాంగ్‌కి అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని టాక్. అందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించనుందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. ఇదిలావుండగా పుష్ప 2పై తాజాగా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
పుష్ప 2లో ఐటెమ్ సాంగ్ చేయటానికి ఊర్వశీ రౌతేలా ఏకంగా రూ.6 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే ఆమెకున్న క్రేజ్.. అలాగే సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది కాబట్టి మేకర్స్ కూడా ఓకే చెప్పారట. దీనికి తోడు సాంగ్ సాంగ్ సెట్ కోసం ఎలాగూ కోటికి తక్కువదు. దీన్నిబట్టి పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ ఏకంగా 7కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, మారేడుమిల్లిలలో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ రిలీజ్ పై ఇంకా స్పష్టత రాలేదు.