Pushpa 2 Item Song : ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న మోస్ట్ అవెయిటెడ్ ఇండియన్ మూవీస్‌లో ‘పుష్ప2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ సక్సెస్ పుల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి సంచలన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. పుష్ప1 లో సాంగ్స్ ఎంత హిట్టయ్యాయో అందరి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే చాలు.. కచ్చితంగా ఆ మూవీలో ఐటం సాంగ్ ఉంటుంది. మొదటి సినిమా ఆర్య నుంచి సుక్కు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు.
ఇక లేటెస్ట్ మూవీ పుష్పలో.. ‘ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా మావ అంటూ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా ఓ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. చంద్రబోస్ దీనికి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి ఆలపించారు. సాంగ్ రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అయితే పుష్ప 2 సినిమా మొదలైనప్పటి నుంచి ఈ చిత్రంలో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా నెట్టింట ఓ ఫోటో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
రన్ రాజా రన్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ బ్యూటీతో కలిసి అల్లు అర్జున్‌ను హగ్ చేసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఎదగడానికి డ్యాన్సర్లకు రెక్కలు అవసరం లేదు.. అది తెలుసుకున్న వారికి వారి ఎనర్జీ దారిచూపుతుంది…’ అంటూ అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేసింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ‘పుష్ప 2లో ఖచ్చితంగా ఈమెనే ఐటమ్ సాంగ్ చేస్తుందని’ అభిప్రాయ పడుతున్నారు. అదే నిజమైతే సీరత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోవడం ఖాయం
https://twitter.com/IamSeeratKapoor/status/1655518158458097666?t=hF9LebGBvLPQl0K6Tq8xdg&s=19