Pushpa 2 Leaked Video : ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న మోస్ట్ అవెయిటెడ్ ఇండియన్ మూవీస్‌లో ‘పుష్ప2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ సక్సెస్ పుల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుకుమార్ టేకింగ్, బన్నీ పెర్ఫామెన్స్, రష్మిక మందన్న గ్లామర్‌తో పాటు దేవిశ్రీ ప్రసాద్ పాటలకు యావత్ దేశం ఫిదా అయింది. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది.
సౌత్ ని మించి నార్త్ ఆడియన్స్ పుష్పను ఆదరించడం విశేషం. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్‌పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డైరెక్టర్ సుకుమార్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. మరోవైపు మారేడుమిల్లిలో డైరెక్టర్ సుక్కు టీం యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించి ఓ లీకుడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా ఈ మూవీ నుంచి యాక్షన్ సీన్ వీడియో లీకైంది. అందులో ఎర్రచందనం లోడ్ తో కొన్ని లారీలు నదిలో వెళ్తుండగా.. పోలీసులు వాటిని ఛేజ్ చేస్తున్నారు. అయితే ఇది అవుడ్ డోర్ షూటింగ్ కావడంతో.. కొందరు అభిమానులు ఆ విజువల్స్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప2 లో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తో పాటు జగపతిబాబు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
A leaked video from #Pushpa2 🔥🔥🔥 At Rampachodavaram#PushpaRaj pic.twitter.com/X8SQHS91K0
— @Mani💘Nani💥AA (@N17780603Nani) June 16, 2023