Pushpa 2 Release Date : పుష్ప 1 (ది రైజ్) సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 (ది రూల్) కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్నీ భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది.
పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోగా హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ మారేడుమిల్లిలో జరుగుతుండగా.. ఫాహాద్ ఫాసిల్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే పుష్ప 2’ సినిమా రిలీజ్ గురించి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.
‘పుష్ప2’ సినిమా డిసెంబర్ 22వ తేదీన లేదా వచ్చే ఏడాది జనవరిలో కానీ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సెకండ్ హాఫ్ లో బన్నీ డాన్ గా కనిపిస్తాడని సమాచారం. ఈ లుక్ లో బన్నీ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పుష్ప 1 రికార్డులను బద్దలుకొట్టి పుష్ప2 మరెన్నీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.