Pushpa 2 Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో మనకు తెలిసిందే. ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప 1కి కి సీక్వెల్ గా పుష్ప ది రూల్ (పుష్ప 2) ఉంటుందని మేకర్స్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప 1లో లేని కొన్ని పాత్రలు పుష్ప 2 లో ఉన్నట్టు సమాచారం.
అందులో భాగంగా విజయ్ సేతుపతి, సాయి పల్లవి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి పాత్రల నిడివి తక్కువైనా సినిమాకు కీలకం కానున్నాయట. ఇదిలా ఉండగా పుష్ప 2 నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా 3 నిమిషాల యాక్షన్ టీజర్ ను విడుదల చేయనున్నారట. టీజర్ కట్ కూడా ఆల్రెడీ అయిపోయిందట.
మ్యూజిక్ , బాక్గ్రౌండ్ వర్క్స్ జరుగుతున్నాయట. ఏదేమైనా అల్లు ఆర్మీకి బన్నీ బర్త్ డేకి సందర్భంగా ఇది అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పొచ్చు. బన్నీ, సుకుమార్, దేవీప్రసాద్, చంద్రబోస్ కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పుష్ప1 తో అది మరోసారి ప్రూ కాగా పుష్ప 2తో రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పుష్ప 1 హిట్ తో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.