Pushpa2 Crazy Update : పుష్ప 1 (ది రైజ్) సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 (ది రూల్) కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోగా, హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే పుష్ప2 లేటెస్ట్ షెడ్యూల్ మారేడుమిల్లిలో ఈ రోజు ప్రారంభమైంది. ఫాహాద్ ఫజిల్, బ్రహ్మాజీపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 10 రోజులు ఉంటుందని సమాచారం. మొన్న బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కి ఆడిపోయే రెస్పాన్స్ రాగా, ఇటీవల పుష్ప ఆడియో రికార్డ్ ధర పలికినట్టు సమాచారం. ఏదేమైనా పుష్ప1 రికార్డులను పుష్ప2 బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.