Ram Charan All Time Favorite Movies: RRR మూవీతో రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు అంతర్జాతీయ వేదికలపై చరణ్ పేరు మార్మోగిపోతుంది. ఇటీవల గుడ్ మార్నింగ్ అమెరికా షోలో, HCA అవార్డ్ ప్రెసెంటర్ గా అటెండ్ అయిన చెర్రీ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో అదరగొడ్తున్నాడు.
చరణ్ నెక్స్ట్ ఆస్కార్ ఈవెంట్ కోసం సిద్ధం అవుతున్నాడు. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్లనుండగా ఈ గ్యాప్ లో అయితే చరణ్ అక్కడి మీడియా వారితో ముచ్చటిస్తున్నాడు. ఈ సందర్భంగా చరణ్ తన ఆల్ టైం ఫెవరెట్ సినిమాల లిస్ట్ ని తెలిపాడు. హాలీవుడ్ మూవీస్ గ్లాడియేటర్, ది నోట్ ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ అలాగే
జేమ్స్ కెమరూన్ టెర్మినేటర్ 2 సినిమాలు బాగా ఇష్టం అని వాటిలో టెర్మినేటర్ 2 చాలా ఎక్కువ సార్లు చూశానని చరణ్ తెలిపాడు. ఇక ఇండియన్ సినిమాలో అయితే దాన వీర శూర కర్ణ, తన రంగస్థలం, మిస్టర్ ఇండియా, రాజమౌళి బాహుబలి సినిమాలు బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.