హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్ ఎప్పుడూ ఉండేదే.. ఎవరికి వారు తమ హీరోనే గొప్ప అంటూ ఎదుటివారితో వాదిస్తూనే ఉంటారు. కానీ హీరోల మధ్య ఎప్పుడూ అలాంటి వాతావరణం కనిపించదు. ఒకరికొకరు ఎదురైనప్పుడు ఆప్యాయంగా నడుచుకుంటూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకుంటారు.
తెలుగులో ఈ మధ్య కాలంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్
RRR (రౌద్రం రణం రుదిరం) ఈ చిత్రానికి సంబంధించిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తన పుట్టిన రోజు సందర్భంగా గత మార్చి లో విడుదలైంది. ఫస్ట్ లుక్ టీజర్ లో “మా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు” అంటూ ఎన్టీఆర్ చెప్పిన వాయిస్ ఓవర్ అభిమానులను ఉర్రూతలూగించింది.
ఇక బీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దసరా కానుకగా భీమ్ ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి రామ్ చరణ్ ఎన్టీఆర్ల మధ్య ఒకరిపై ఒకరు సరదాగా చలోక్తులు విసురుకుంటూ ట్విట్టర్ లో ట్విట్స్ చేశారు.
“బ్రదర్ తారక్ నిన్ను టీజ్ చేయడానికి ఇక్కడ ఏదో ఉంది. కానీ మీలా కాకుండా, నేను సమయానికి వచ్చేలా చూస్తాను” అంటూ బీమ్ ఫస్ట్ లుక్ అప్ డేట్ వీడియో పోస్ట్ చేసి ట్వీట్ చేయగా.. దానికి తారక్ స్పందిస్తూ “బ్రదర్ రామ్ చరణ్ .. మీరు ఇప్పటికే 5 నెలలు ఆలస్యం చేశారని మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు.. మీరు వ్యవహారం చేస్తున్నది జక్కన్న రాజమౌళి తో ఆయనతో ఏమైనా జరగచ్చు!! ఏమైనా వెయిట్ చేయలేను.. ఫుల్ ఎక్సయిట్ గా ఉంది” అని రిప్లై ఇచ్చారు.
వారిద్దరి మధ్య సరదాగా జరిగిన సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటుంది. రేపు ఉదయం 11 గం లకు తారక్ భీమ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.