Ram Charan: దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు మొదటి సినిమాతోనే 100కోట్లు కొల్లగొట్టాడు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈరోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో చరణ్, బుచ్చిబాబుకి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ త్వరలో సెట్స్ లో కలుద్దాం అంటూ ట్వీట్ చేసాడు. బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్టు చెర్రీతో చేయనున్న విషయం తెలిసిందే. దీన్ని మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. మొదటి సినిమా పూర్తయ్యాక బుచ్చిబాబు తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి ఎంతగానో ఎదురు చూసాడు.
కానీ కొరటాలతో NTR 30 అనుకున్న టైంకి పూర్తవకపోవడంతో బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి మూవీ అనంతరం బుచ్చిబాబుకు స్టార్ హీరోతో అవకాశం రావడంతో గురువుకి తగ్గ శిష్యుడు అంటూ ప్రశంసిస్తున్నారు. కొడితే 1000 కోట్లు మన కాళ్ళ దగ్గర పడాలి.. #RC16తో పాన్ ఇండియా షేక్ అవ్వాలి మావ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. చూడాలి బుచ్చిబాబు చెర్రీకి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో..
Happiest birthday to one of my fondest directors @BuchiBabuSana !!
Wishing an incredibly happy and healthy year ahead.See you on sets soon!❤️ pic.twitter.com/ZuWTLa3fRZ
— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2023
Discussion about this post