Ram Charan Craze: RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. RRR మూవీ వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డుల పరంగానూ దుమ్మురేపుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ సహా పలు అవార్డులను దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం ఎదురు చూస్తోంది. ఈ చిత్రంలో చరణ్ నటనను అవతార్ డైరెక్టర్ ప్రశంసించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా రామ్‌చరణ్‌కి ఓ అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రముఖ ఛానెలైన అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలో ప్రసారమయ్యే ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకి చరణ్ గెస్ట్ గా వెళుతున్నాడు. ఈ షో ఫిబ్రవరి 22న మధ్యాహ్నం గం.1కి మరియు రాత్రి గం.11.30కి టెలికాస్ట్ కానుంది. ఈ షోకి వెళ్లిన మొదటి భారతీయ నటుడు చరణ్ కావడం విశేషం.
ఆ షోలో RRR మూవీ అనుభవాలతో పాటు, తన నెక్స్ట్ మూవీ విశేషాలను అలాగే వ్యక్తిగత విషయాలను అక్కడి ప్రేక్షలతో పంచుకోనున్నాడు. చేరికి ఇలాంటి అవకాశం రావడం.. టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాకి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందనడానికి చిహ్నం. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో RC 15 లో నటిస్తున్న విషయం తెలిసిందే.
https://twitter.com/vamsikaka/status/1628255642707456001?t=dp4hO4l2FOSyqef2XvMAAg&s=19