Ram Charan in Bollywood : RRR మూవీ కంప్లీట్ అవగానే రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలోని RC 15 లో బిజీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కి కొంత గ్యాప్ రావడంతో చరణ్ అండ్ RRR టీం అమెరికా వెళ్లగా చరణ్ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అమెరికాకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా చరణ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ కాగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబో మూవీలో చరణ్ కూడా కనిపించనున్నాడట.
అయితే చెర్రీ స్టోరీలో కాకుండా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నాడట. సల్మాన్ ఖాన్ కు మెగాఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ చరణ్ ని ఆరాధించే జానీ మాస్టర్ కావడంతో ఈ సాలిడ్ కాంబో సెట్టయ్యింది. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాల్సిందే.
