Ram Charan: వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సంక్రాంతి సందర్భంగా రవితేజతో కలిసి జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాదు తన గత సినిమాల రికార్డులను కూడా బద్దలు కొడుతూ కలెక్షన్ విషయంలో ముందుకు దూసుకు వెళుతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన విజయోత్సవ వేడుకలు తెలంగాణలోని వరంగల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంచరణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఫ్యామిలీ, ఫ్యాన్స్ తప్ప.. చిరంజీవి జోలికి ఎవరొచ్చినా మేం ఊరుకోం.. అని చెర్రీ చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవనే ఉత్కం నెలకొంది. ఇంతకీ.. ఈ కామెంట్స్ రాంచరణ్ ఎందుకు చేశారు..? ఎవరినుద్దేశించి చేశారనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Also Read: ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేకపోతున్న జగన్
తమ్ముడిలాంటి రవితేజ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమన్నాడు కాబట్టి సరిపోయింది. అదే మరొకరు అయ్యుంటే ఏం జరిగింది ఉండేదే అంటూ రాంచరణ్ వ్యాఖ్యనించాడు. చిరంజీవిని ఏదైనా అనాలంటే ఫ్యామిలీ అయినా అయ్యుండాలి. ఫ్యాన్స్ అయినా అయ్యుండాలి అన్నారు రామ్‌చరణ్. వాల్తేరు వీరయ్య సక్సెస్‌మీట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి సౌమ్యులు కావచ్చు.. మేం కాదు అంటూ ఘాటుగా మాట్లాడారు.
తమ్ముడు పవన్‌కల్యాణ్ మాదిరిగానే రవితేజను భావించారు కాబట్టి, ఆ డైలాగ్ చెప్పగలిగారని, మిగతారైతే ఏం జరిగి ఉండేదో అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక వాల్తేరు వీరయ సక్సెస్ మీట్ విజయంతంగా జరిగింది. మెగా ఆభిమానులతో ఓరుగల్లు ఉప్పొంగింది. ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఓరుగల్లుపై అడుగుపెట్టినప్పుడు చూపిన ప్రేమ అభిమానం ఇంకా ఉందన్నారు చిరంజీవి.
Mega Power Entry ❤️🔥❤️🔥❤️🔥#RamCharan #WalterVeerayya pic.twitter.com/uJdtRd3zjX
— … (@MrTemporary_) January 28, 2023